ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ లారీని ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి(Student dead) చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్ వాడ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జైనథ్ మండలం కోరాటాకు చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థి మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పిప్పర్వాడకు చేరుకోగానే అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు.
ఈ ప్రమాదంలో హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స కోసం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.