KCR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. పేదల సంక్షేమమే మా ధ్యేయం అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ నిరుపేదల గుండెలపైకి బుల్డోజర్లను పంపుతున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడితే వచ్చే అరకొర సంపాదనతో బతుకు బండి లాగుతున్న నిరుపేదల పట్ల నియంతలా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి.
ఓ వైపు హైడ్రా పేరిట పేదోళ్ల గూడును చెదరగొడుతున్న రేవంత్ రెడ్డి.. మరో వైపు పొట్టకూటి కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల నిర్మాణాలను కూడా నేలమట్టం చేస్తున్నాడు. ఆ నిరుపేదల జీవితాలను మట్టిపాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.
తాజాగా హైదరాబాద్ మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్ ముందున్న చెప్పుల దుకాణంను అధికారులు కూల్చివేశారు. దీంతో ఆ దుకాణం యజమానిరాలితో పాటు ఆమె కొడుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా దుకాణం కూల్చేస్తే తాము ఎలా బ్రతకాలి అంటూ తల్లడిల్లీపోయారు తల్లీకుమారుడు. కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు.. నువ్వు రావాలి అంటూ ఆ తల్లీకుమారుడు కంటతడి పెట్టుకుని బోరున విలపించారు.
మా షాపు కూలిస్తే మేము ఎలా బ్రకతకాలి అంటూ తల్లడిల్లుతున్న తల్లీకొడుకు
కూల్చివేతలతో రోడ్డున పడుతున్న మరో కుటుంబం
హైదరాబాద్ – మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్ ముందు ఉన్న చెప్పుల దుకాణం కూల్చివేస్తున్న అధికారులు.
కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు.. నువ్వు రావాలి అంటూ కంటతడి పెట్టుకున్న… pic.twitter.com/heSK0KrnOD
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అమృత్ టెండర్లలో రేవంత్ భారీ అవినీతి.. బీజేపీ మౌనంపై కేటీఆర్ ఆశ్చర్యం..
Bathukamma | పువ్వులనే దైవాలుగా పూజించే పండుగ.. మన బతుకమ్మ పండుగ.. ఇవీ విశేషాలు..!
Harish Rao | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. గూండా రాజ్యం నడుస్తుంది : హరీశ్‌రావు