హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో( Kamareddy district) అనాగరిక చర్య చోటు చేసుకుంది. రోజురోజుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకెళ్తున్నా అదే సమయంలో దేశంలో మూఢ నమ్మకాలు(Superstitions) పెరిగిపోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఓ వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డారు. విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా అడ్లూరులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిపై గ్రామస్తులు మంత్రాలు చేస్తున్నాడనే ఆరోపణలతో చెట్టుకు కట్టేసి కర్రలతో(Attacked with sticks) విచక్షణారహితంగా కొట్టారు.
నెల రోజుల క్రితమే సాయిలును ఊరి నుంచి వెలివేశారు. అప్పటి నుంచి అతడు కామారెడ్డి పాతబస్టాండ్ వద్ద అద్దెకు ఉంటున్నాడు. మళ్లీ సాయిలుపై గ్రామస్తులు దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యులు దాడి చేసిన వారిపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
TGPSC | నేటి నుంచి గ్రూప్-1 హాల్టికెట్లు.. మరికాసేపట్లో విడుదల చేయనున్న టీజీపీఎస్సీ
CPI Narayana | సాయిబాబాది సహజ మరణం కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : సీపీఐ నారాయణ
KTR | కాంగ్రెస్ పాలనపై నిరసనలకు సిద్ధమవుతున్న ప్రజలు.. ముఖ్రాకే వాసులకు కేటీఆర్ మద్దతు