Love Marriage | ధరూరు : ప్రేమ పెండ్లి కేసులో తమ కుటుంబసభ్యులను అమ్మాయి తరపు వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ ఓ యువకుడు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాడు.
వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం జాంపల్లి గ్రామానికి చెందిన వీరేశ్.. అదే గ్రామానికి చెందిన శృతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కూతురు అదృశ్యమైందని అమ్మాయి తరపు వారు కేసు పెట్టారు. ఎస్సై అబ్దుల్లాషుకూర్ తమను పిలిచి బలవంతంగా విడదీసి అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించాడని వీరేశ్ తెలిపారు. ఈ క్రమంలో అమ్మాయి బంధువులు తమ కుటుంబసభ్యులపై పలుమార్లు దాడి చేశారని, వారి వేధింపులు భరించలేక గద్వాలలో నివసిస్తున్నామని, గ్రామానికి వస్తే చంపుతామంటూ బెదిరింపులకు ప్పాలడుతున్నారని, ఈ విషయంపై నాలుగు సార్లు కేసులు పెట్టినా ఎస్సై పట్టించుకోవడం లేదన్నారు. దీంతో విరక్తి చెంది స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టినట్లు వీరేశ్ తెలిపారు.
ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా.. ఆగస్టులో శృతి అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. రామేశ్వరంలో వారి ఆచూకీ లభించగా.. తాము వెళ్లే సరికే వీరేశ్ పారిపోయాడన్నారు. అమ్మాయిని స్టేషన్కు తీసుకొచ్చి వాంగ్మూలం తీసుకొని, ఆమె కోరిక మేరకే తల్లిదండ్రుల వద్దకు పంపామన్నారు. కాగా, తన కుటుంబంపై దాడి చేసినట్లు వీరేశ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందించామన్నారు. అయినా వీరేశ్ తమ మీద అవాస్తవమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
KTR | జైలుకు వెళ్లేందుకు అభ్యంతరం ఏం లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపే దమ్ముందా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్