Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర అన్ని కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు.
రూ.500 అపరాధ రుసుముతో 18వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | జైలుకు వెళ్లేందుకు అభ్యంతరం ఏం లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకు ఏసీబీని పంపే దమ్ముందా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్