Mahabubnagar | మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లారీలో మంటలు(Lorry accident) చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమవ్వగా సుమారు 200 వందల మేకలు(200 goats) మృతి చెందాయి. ఈ విషాదకర సంఘటన భూత్పూర్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు మేకల లోడ్ వెళ్తున్న లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై సూచిక బోర్డును ఢీకొట్టడంతో లారీలోఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి, మేకలు సజీవదహనమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Food Safety | కుళ్లిన మాంసం.. కలుషితమైన ఆహార పదార్థాలు.. టీజీ-సేఫ్ దాడుల్లో బయటపడిన ఘోరాలు
Ranabali Movie | అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్న శింగనమల బొబ్బిలి రణబాలి
Baby Sale | దారుణం..ఎనిమిది రోజుల పసికందును అమ్మకానికి పెట్టిన ఓ తల్లి