సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కూకట్‌పల్లిలో కుళ్లిన, కలుషిత ఆహార పదార్థాలు కలిగి ఉన్న హోటళ్లు, బేకరీలు, స్వీట్‌షాప్‌లు, పీజీ హాస్టళ్లపై తెలంగాణ స్టాం డర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్(టీజీ-సేఫ్) అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీ సు సిబ్బందితో కలిసి జరిపిన దాడుల్లో 20 ఆహార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేయ గా, పలు హోటళ్ల బేకరీలు, పీజీ హాస్టళ్లలో కుళ్ల్లిపోయిన, కూరగాయలు, మటన్, చికెన్ వంటివి బయటపడ్డాయి.
ఆహార పదార్థాల నమూనాల సేకరణ
తనిఖీలలో గుర్తించిన కలుషితమైన మా ంసం, కూరగాయలను అధికారులు అకడికకడే పారబోయించారు. కొన్ని ప్రాంతాల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద ఉన్న ట్లు గుర్తించారు. అపరిశుభ్రమైన పరిసరాలు, రికార్డుల నిర్వహణలో లోపాలు, శుభ్రంగా లేని రిఫ్రిజిరేటర్లు, శాకాహార-మాంసాహార పదార్థాలను సక్రమంగా వేరు చేయకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించి కలుషిత ఆహార పదార్థాలకు సంబంధించిన నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
లైసెన్స్ లేని హాస్టళ్లు మూసివేత
ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా నిర్వహిస్తున్న జీవీకే న్యూలగ్జరీ పీజీ మెన్స్ హాస్టల్‌ను గుర్తించడంతో పాటు ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో హాస్టల్‌ను మూసివేయించారు.
ఆరు సంస్థలకు నోటీసులు
గుమ్మడిఫుడ్స్లోని శ్రీ మహాలక్ష్మి కేంద్ర, కేస్ బేకర్స్, లక్ష్మీ వెంగమాంబ హాస్టల్, పద్మావతి డీలక్స్ మెస్, మహెఫిల్ రెస్టారెంట్, శ్రీహర్ష డీలక్స్ మెస్‌లకు లోపాలను సరిదిద్దాలంటూ ‘ఇంప్రూవ్ మెంట్’ నోటీసులు జారీ చేశారు. మరోసారి తనిఖీలు నిర్వహించిన తరువాత నిబంధనలు పాటించకపోతే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
నాలుగు సంస్థలకు షోకాజ్
ప్యారడైజ్ ఫుడ్కోర్ట్, చైతన్య ఫుడ్కోర్ట్, భూలక్ష్మి మెస్, గోదావరి మిఠాయి సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆహార పదార్థ్ధాల భద్రత నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలు విధించేందుకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఐదు సంస్థలపై సస్పెన్షన్ వేటు
ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఐదు సంస్థల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి, తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. లైసెన్స్‌లు సస్పెండైన వాటిలో మణికంఠ లైవ్ స్పేస్ లగ్జరీ ఉమెన్స్ హాస్టల్, బాలాజి లగ్జరీ మెన్స్ పీజీ హాస్టల్, హోటల్ సితార గ్రాండ్, బేక్ మ్యాక్స్ ఫుడ్స్ ప్రై.లి(బ్రౌన్ బీర్ మ్యానుఫక్షరింగ్ యూనిట్), మండి కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ఉన్నాయి. ఈ సంస్థల్లో బొద్దింకలు, ఫంగస్ కలుషితమైన ముడి పదార్థాలు, అపరిశుభ్రమైన కోల్డ్ స్టోరేజీలు, రిఫ్రిజిరేటర్ల నిర్వహణలో లోపాలు వంటి సమస్యలను అధికారులు గుర్తించారు.