అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’ నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ పీరియాడిక్ డ్రామాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నది. రష్మిక మందన్న కథానాయిక. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. బుధవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. బ్రిటీష్ పరిపాలనా కాలంలో రాక్షస రాజుగా పేరున్న సర్ థియోడర్ హెక్టార్ ప్రజల్ని పీడిస్తూ అన్నపూర్ణగా వెలిగిన నేలను కరువు సీమగా మారుస్తుంటాడు.
అతన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలుస్తుంటాడు రణబాలి. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం గూజ్బంప్స్ తెప్పించింది. బ్రిటీష్ అధికారులకు సవాలు విసురుతూ ‘శింగనమల బొబ్బిలి రణబాలిరా’.. ‘ఆ కొండపైనున్న మా భద్రమల్లాడి మీద ఆన, నేను కాయలి కాసాండంగా ఒక్క మెతుకుగూడ పొలిమేర దాటదు చెప్తన్నా’ అంటూ రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ చెప్పిన సంభాషణలు టీజర్లో హైలైట్‌గా నిలిచాయి. 1854-1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.