పెబ్బేరు, సెప్టెంబర్ 25 : ఎన్‌హెచ్-44పై చేపల వాహనం బోల్తా పడిన(Fish vehicle overturned) ఘటన వనపర్తి(Wanaparthi) జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లె సమీపంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు బోలెరో వాహనంలో చేపలను తీసుకెళ్తుండగా.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బుధవారం తెల్లవారుజామున తోమాలపల్లె గ్రామ సమీపంలో వ్యాన్ బోల్తా పడగా.. డ్రైవర్, క్లీనర్‌కు స్వల్పగాయాలయ్యాయి.
రోడ్డు పక్కన ఉన్న గుంతలో వాహనం పడిపోవడంతో చేపల బాక్సులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో చేపలను తీసుకెళ్లేందుకు స్థానికులు పోటీపడ్డారు. మొత్తం 1,100 కేజీల చేపలు తీసుకెళ్లగా.. రూ.లక్ష నష్టం వాటిల్లినటుల డ్రైవర్ లీలామోహనరెడ్డి, క్లీనర్ తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్