న్యూఢిల్లీ: మోడల్ ట్విషా శర్మ(Twisha Sharma) ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మే 12వ తేదీన ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె తన ఆడపడుచుకు వాట్సాప్ మెసేజ్ చేసింది. భార్య వదిలి వెళ్లిన వాటిని వచ్చి తీసుకెళ్లమని, కానీ రేపు రావాలని, ఇప్పుడు తనను ప్రశాంతంగా చానివ్వాలని ట్విషా శర్మ తన మరదలుకు మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఆమె భూపాల్‌లోని అత్తారింటిలో జిమ్నాస్టిక్ తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. సోమవారం కోర్టులో సీబీఐ తన ఛార్జ్‌షీట్‌ను ప్రజెంట్ చేసింది. ఆ నివేదికలో ట్విషా శర్మ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు.
సుమారు 600 పేజీలతో సీబీఐ రిపోర్టును తయారు చేసింది. భర్త, అత్త పెట్టిన చిత్రహింస వల్లే.. ట్విషా శర్మ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. ట్విషా శర్మ భర్త సమర్త్ సింగ్, అత్ల గిరిబాలా సింగ్‌పై కేసు బుక్ చేశారు. ఆమె అత్త జిల్లా జడ్జీగా చేసి రిటైర్ అయ్యారు. పెళ్లి అయిన ఆరు నెలల్లో భర్త సమర్త్, అత్త గిరిబాలా ఎలా చిత్రహింస పెట్టారో ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ట్విషా, సమర్త్ ఫోన్లకు చెందిన పూర్తి ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావాల్సి ఉన్నది. భోపాల్‌లోని గిరిబాలా సింగ్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫూటేజ్ ను కూడా పరిశీలించాల్సి ఉన్నది.
ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు .. ట్విషా శర్మ ఉరివేసుకుని మృతిచెందినట్లు పోస్టుమార్టమ్‌లో పేర్కొన్నారు. చైనీస్ స్టాక్ మార్కెట్లో 20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని, దాని కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని భర్త సమర్త్ వేధిస్తున్నట్లు ట్విషా తన మరదలుతో మెసేజ్‌లో పేర్కొన్నది. ట్విషా, సమర్త్ కుటుంబం మధ్య ఆ రోజే సుమారు 34 సార్లు మాట్లాడే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది.