Uttarakhand | ఉత్తరాఖండ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల హెచ్చరికల (Heavy rains) కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా నేడు (మంగళవారం) డెహ్రాడూన్ జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు స్థానిక యంత్రాంగం సెలవు (Schools closed )ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వర్షాలకు కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు పోటెత్తుతుండంటతో రవాణాకు అంతరాయం ఏర్పడుతున్నది. కాగా, ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున స్థానిక వాతావరణం, క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి ఇతర జిల్లాల అధికారులు వేర్వేరు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని ప్రభుత్వం సూచించింది.