భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణిలో(Singareni) ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పటంతో దళారుల మాట నమ్మిన లక్షలు రూపాయలు ముట్ట జెప్పారు. తీరా తాము మోసపోయామని గుర్తించి బలవన్మరణానికి(Couple committed suicide) పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా బూర్గుపాడు మండలం సాయిరాం తండాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన లకావత్ రత్నకుమార్, పార్వతి దంపతులకు ఓ దళారి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో అప్పు చేసి సదరు దంతపులు రూ.16 లక్షలు చెల్లించారు. అయితే ఉద్యోగాలు రాకపోగా అప్పులు కట్టాలని ఒత్తిడి పెరగడంతో మనస్తానం చెందిన రత్నకుమార్, పార్వతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రత్నకుమార్, పార్వతి దంపతుల ఆత్మహత్యతో తండాలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్