హైదరాబాద్ : సూర్యాపేట(Suryapet) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ(Wall collapsed) కూలి ఓ బాలుడు మృతి (Boy died )చెందగా మరొకిరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలోని దండు మైసమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవాన్ష్ (6), హిమాన్ష్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఆలయం వద్ద ఆడుకుంటున్నారు.
ఇదే సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలడంతో హిమాన్ష్ అక్కడికక్కడే మృతి చెందగా అన్న దేవాన్ష్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్కు తరలించారు. అప్పటి వరకు సంతోషంగా ఆడుకుంటున్న కొడుకు కండ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.