ములుగు : ములుగు జిల్లాలో(Mulugu district) పిచ్చి కుక్క స్వైర విహారం(Mad dog attack) చేసింది. దొరికిన వారిని దొరినట్లు కరిచి బీభత్సం సృష్టించింది. పిచ్చి కుక్క దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరా ల్లోకి వెళ్తే..ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం పొదుమూరు గ్రామంలో పిచ్చి కుక్క 9 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచింది(People injured). గ్రామానికి చెందిన ఎర్రావుల సమ్మయ్య, కొప్పుల లాలయ్య, దాదాని, సైదా మైతున్ బీ, ఘోరే తో పాటు మరోముగ్గురిపై దాడి చేసి కరవగా తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను మంగపేట ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. కాగా, గ్రామాల్లో ఇటీవల పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా స్థానిక అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ: కేసీఆర్
KTR | కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం: కేటీఆర్
Nalimela Bhaskar | సాహితీవేత్త నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారం