బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 11:10:47

దోస్త్‌ మూడో విడ‌తలో 57,695 సీట్ల కేటాయింపు

దోస్త్‌ మూడో విడ‌తలో 57,695 సీట్ల కేటాయింపు

హైద‌రాబాద్‌: ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మూడో విడ‌త సీట్ల కేటాయింపు పూర్త‌య్యింది. ఇందులో భాగంగా 57,695 మంది విద్యార్థుల‌కు దోస్త్ ద్వారా సీట్లు కేటాయించారు. సీటు వ‌చ్చిన అభ్య‌ర్థులు ఈనెల 26లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల‌ని దోస్త్ క‌న్వీన‌ర్ లింబాద్రి సూచించారు. దోస్త్ ప్ర‌త్యేక విడ‌త రిజిస్ట్రేష‌న్లు, వెబ్ ఆప్ష‌న్లు ఈరోజు నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని చెప్పారు. ఈనెల 26 వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు, వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవ‌చ్చ‌ని తెలిపారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo