రేపటి నుంచి టాటా కార్ల ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ : దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. భారత్ లో తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను శనివారం నుంచి పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇప్పటికే కార్లను బుక్ చేసుకుని డెలివరీకి వేచిచూస్తున్న వారికి ధరల పెంపు వర్తించబోదని కంపెనీ స్పష్టం చేసింది. వ్యాపార వ్యూహ ప్రణాళికలో భాగంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రణాళికలో కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలనూ కాపాడేందుకూ కంపెనీ చొరవ చూపుతుందని టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.
ఇక స్టీల్ ఇతర లోహాల ధరల పెరుగుదలతో కొంత భారాన్ని వినియోగదారులకు మళ్లించక తప్పలేదని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఏయే మోడల్ పై ధర ఎంత పెరుగుతుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే భారత్ లో తమ అన్ని కార్లపై సగటున 1.8 శాతం వరకూ ధరలు పెరుగుతాయని, మోడల్స్ వాటి వేరియంట్స్ కు అనుగణంగా ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Cars
- price hike
- tata motors
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

