Dogs | తాండూర్, ఫిబ్రవరి 7 : మత్తుమందు ఓవర్ డోస్‌తో సుమారు 50కి పైగా శునకాలు మృతి చెందినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
తాండూర్ మండల కేంద్రంలో శునకాల బెడద తీవ్రమైందని, తరచూ పిల్లలను కరుస్తున్నాయని ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు మండలంలో గుంటూరు నుంచి తీసుకువచ్చిన ఓ వ్యక్తితో మత్తు మందు ప్రయోగం చేయించారు. కుక్కలను పట్టుకుని స్థానిక తిర్యాణి అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నారు. కుక్కలకు మత్తుమందు ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఓవర్ డోస్ అయి సుమారు 50 కుక్కలు మృతి చెందినట్లు స్థానికంగా చర్చనీయాంశం అయింది. అధికారులు మాత్రం శునకాలకు మత్తుమందు మాత్రమే ఇచ్చామని చంపలేదని 10 నుంచి 15 వింత వ్యాధి సోకిన శునకాలు మాత్రమే మత్తు మందు వికటించి మృతి చెందాయని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Jogu Ramanna | ఆధ్యాత్మిక భావాలు కలిగిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ : మాజీ మంత్రి జోగు రామన్న
MLA Jadhav Anil | సమస్యల పరిష్కార బాధ్యత నాదే : బోథ్ ఎమ్మెల్యే జాధవ్ అనిల్