నేరడిగొండ : నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ (MLA Jadhav Anil) అన్నారు. శుక్రవారం మండలంలోని గుత్పాల, యాపాలగూడ, లక్ష్మీపూర్ గ్రామాల ప్రజలు నేరడిగొండలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు . దీంతో గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.