ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆధ్యాత్మిక భావలు కలిగిన వ్యక్తి కేసీఆర్ సీఎం అయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు జోగు రామన్న (Jogu Ramanna) అన్నారు . శుక్రవారం ఆదిలాబాద్‌లోని వార్డు నంబర్ 12 శ్రీనగర్ కాలనీలో నిర్మించనున్న శ్రీ రాధకృష్ణ ఆలయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోగు రామన్నను కాలనీ వాసులు సత్కరించారు.
మాజీ మంత్రి మాట్లాడుతూ సనాతన ధర్మం, ఆచార పద్ధతులను భవితరాలకు అందించాలని సూచించారు. రాష్ట్రం కోసం ఏ సీఎంలు చేయని కేసీఆర్ (KCR) విధంగా యాగాలు, యజ్ఞలు చేసి రాష్ట్రానికి సాధించడమేగాక దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిపారని పేర్కొన్నారు. ప్రజలు కూడా హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తునే భావి తరాలకు మన ఆచారాలు, సంస్కృతి,పద్దతులను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పవన్ నాయక్, విజ్జగిరి నారాయణ, ఖలీం, లక్ష్మణ్, సంతోష్, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.