శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 13:06:46

గ్రేటర్‌లో ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్‌కే : మంత్రి నిరంజన్‌రెడ్డి

గ్రేటర్‌లో ప్రజల ఆశీస్సులు టీఆర్ఎస్‌కే : మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : జీఎచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు టీఆర్‌ఎస్‌కేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ వరదసాయంపై ఫిర్యాదులతో పేదల నోటికాడ బుక్క లాగేస్తారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ప్రజలు, బాధితుల పట్ల బాధ్యత లేదన్నారు. రూ.పదివేల వరదసాయం అడ్డుకోవడం అవివేకమని మండిపడ్డారు. ఆరేండ్లలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.

అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కట్టాయి.60 ఏండ్లు జాతీయ పార్టీల ఏలుబడిలో అక్రమ లే అవుట్లు, కబ్జాలతో హైదరాబాద్ ఆగమైందని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగింపునకు నగర ప్రజల ఆశీస్సులు కోరదామన్నారు. పట్నంలో గడపగడపకూ టీఆర్ఎస్ పాలనా విజయాలు చేర్చి .. ప్రజల మద్దతు కోరాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.