శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 18, 2020 , 17:09:31

కరోనా పై పోరుకు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి చేయూత

కరోనా పై పోరుకు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి చేయూత

మహబూబ్ నగర్ : కరోనాపై పోరులో దాతలు ముందుకొస్తున్నారు. ఆపదలో ఉన్నవారని ఆదుకునేందుకు తమ వంతు సాయంగా భరోసా కల్పిస్తూ తమ ఔదార్యాన్ని చాటుతున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా యంత్రాంగానికి చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చారు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు రూ. పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాక తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఇంకా బాగా నిర్వహించేందుకు గాను మరో రూ. పది లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. 

ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎంపీ మన్నె వ్యక్తిగత సహాయకుడు కేదార్ నాథ్ ద్వారా రూ. 20 లక్షల ప్రోసిడింగ్ ను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం, కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఎంపీ అభినందించారు. కలెక్టర్ ఎస్. వెంకట రావు మాట్లాడుతూ... కరోనాతో పాటు, హరిత హారం కార్యక్రమానికి ఎంపీ తన సొంత నిధుల నుంచి రూ.20 లక్షల ఇవ్వడం అభినందనీయమన్నారు.


logo