Jurala Project | గద్వాల/అయిజ : మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులకు మళ్లీ వరద మొదలైంది. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో శుక్రవారం జూరాల ప్రాజెక్టు 16 గేట్లను అధికారులు తెరిచారు. ఇన్‌ఫ్లో 89 వేల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,05,042 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.260 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ, ప్రస్తుతం 9.132 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
అలాగే కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 38,476 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 9,488 క్యూసెక్కులు, ఆర్డీఎస్కు ఇన్‌ఫ్లో 36,387, అవుట్‌ఫ్లో 35,700 క్యూసెక్కులు, ఆల్మట్టి డ్యాంకు ఇన్‌ఫ్లో 44,793, అవుట్‌ఫ్లో 44,793 క్యూసెక్కులు, నారాయణపుర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 42,171, అవుట్‌ఫ్లో 43,332 క్యూసెక్కులుగా నమోదైంది.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజాపాలనలో పూర్తిగా పడకేసిన ప్రజారోగ్యం.. విష జ్వరాలతో జనం పరేషాన్ : కేటీఆర్
Rains | తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
KTR | పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు.. అన్ని శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయి : కేటీఆర్