KTR | హైదరాబాద్ : ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా ఉన్న భవనాలన్నీ కూల్చాల్సిందే.. నేతల భవనాలను కూల్చిన తర్వాత సామాన్యులవి కూల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర డీజీపీని కేటీఆర్, సీనియర్ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తన ఇల్లు బఫర్ జోన్ పరిధిలోని లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని ఓ మీడియా ప్రతినిధి కేటీఆర్‌ను ప్రశ్నించగా.. ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి శాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయి. ఆయన అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా శాటిలైట్ ఇమేజేస్ ఉన్నాయి. చూసుకోండి.. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి. ఎఫ్టీఎల్, బఫర్‌లో ఉన్న నిర్మాణాలను మొదట కూల్చడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతల భవనాలను కూల్చేసి ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి అని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
Atchutapuram | అచ్యుతాపురం ప్రమాదానికి జగనే కారణం.. ఏపీ మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు
Jamie Smith | నాలుగో మ్యాచ్‌లోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కుర్రాడు