Jamie Smith : ఇంగ్లండ్ యువకెరటం జేమీ స్మిత్ (Jamie Smith) చరిత్ర సృష్టించాడు. తొలి సిరీస్‌లోనే వెస్టిండీస్ (West Indies)పై సంప్రదాయ క్రికెట్ షాట్లతో ఆకట్టుకున్న స్మిత్ నాలుగో మ్యాచ్‌లోనే శతక గర్జన చేశాడు. తద్వారా చిన్న వయసులోనే శతకం బాదిన ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా అతడు రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో ఓల్డ్ ట్రఫోర్డ్ (Old Trafford) స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో స్మిత్ ఈ ఫీట్ సాధించాడు.
స్మిత్ సూపర్ సెంచరీతో లెస్ అమెస్ పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. అమెస్ 1930లో వెస్టిండీస్‌పై సెంచరీ బాదాడు. అప్పుడు అతడి వయసు 24 ఏండ్ల 63 రోజులు. స్మిత్ 24 ఏండ్ల 42 రోజుల వయసులో వంద కొట్టాడు. శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న స్మిత్ మూడో రోజు శతకంతో చెలరేగాడు.
An incredible talent 👏
A vital innings 🏏
A very bright future 🔥 pic.twitter.com/hTub3LxKGH— England Cricket (@englandcricket) August 23, 2024
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో వెస్టిండీస్‌పై ఐదు పరుగులతో వంద చేజార్చుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు తన తొలి సెంచరీ కలను నిజం చేసుకున్నాడు. లంక బౌలర్లను ఉతికేస్తూ సుదీర్ఘ ఫార్మాట్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో 2022 డిసెంబర్ తర్వాత మూడంకెల స్కోర్ చేసిన వికెట్ కీపర్‌గా అతడు మరో రికార్డు తన పేరిట రాసుకున్నాడు.
MAIDEN TEST 💯!
A dream come true 👏
Live clips: https://t.co/WlpxJWmDmV
🏴 #ENGvSL 🇱🇰 | #EnglandCricket pic.twitter.com/JuC6WRV3Dj
— England Cricket (@englandcricket) August 23, 2024
ప్రస్తుతం స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉన్న ఓలీ పోప్ అప్పుడు పాకిస్థాన్‌పై వంద కొట్టాడు. ఆ తర్వాత భారత పర్యటనలో బెన్ ఫోక్స్ అర్ధ శతకంతో మెప్పించినా.. సెంచరీ మాత్రం అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ వీరోచిత శతకంతో ఇంగ్లండ్ 358 పరుగులకు ఆలౌటయ్యింది. దాంతో పోప్ సేనకు 122 రన్స ఆధిక్యం లభించింది.