Baloda Bazar Incident : బలోద బజార్ కలెక్టరేట్ వద్ద చెలరేగిన హింసాత్మక ఘటనలను కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఖండించారు. ఇది చత్తీస్ఘఢ్ ప్రభుత్వ వైఫల్యమేనని, అధికార యంత్రాంగమే అక్కడ అలాంటి పరిస్ధితి దారితీసేందుకు కారణమని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్‌ను అరెస్ట్ చేశారని అన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండానే అన్ని సెక్షన్లను మోపి ఆయనను బలవంతంగా జైలులో నిర్బంధించారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ ద్వారా ప్రభుత్వం తప్పుడు సంకేతాలను పంపుతున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, పేదల కోసం నిరంతరం పోరాడుతున్నదని, ఇక ముందు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని సచిన్ పైలట్ స్పష్టం చేశారు.
తాము ఈరోజు దేవేంద్ర యాదవ్‌ను కలిశామని, తాము బీజేపీ ప్రభుత్వం దమనకాండపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడతామని పైలట్ స్పష్టం చేశారు. కాషాయ పాలకుల అణిచివేత వైఖరిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కాగా జూన్ 10న బలోద బజార్ కలెక్టరేట్ వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More :