IPhone 16 Series : ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్‌లో రానుండగా, లాంఛ్‌కు కొద్దివారాల ముందు ఫోన్ కెమెరా స్సెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సెప్టెంబర్ 10న ఐఫోన్ 16 సిరీస్ గ్లోబల్ లాంఛ్‌కు యాపిల్ సన్నద్ధమవుతున్నదనే వార్తల మధ్య ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్ల కెమెరా ఫీచర్లు ఇవేనంటూ లీక్‌లు గుప్పుమన్నాయి. కెమెరా స్సెసిఫికేషన్స్లో యాపిల్ భారీ మార్పులు చేపట్టిందని చెబుతున్నారు. అధిక రిజల్యూషన్‌తో కూడిన అల్ట్రా వైడ్ కెమెరా, క్యాప్చర్ బటన్ సహా పలు మార్పులు ఉంటాయని యాపిల్ఇన్సైడర్ రిపోర్ట్ తెలిపింది.
న్యూ ఐఫోన్ 16 సిరీస్ ఇమేజ్‌ల కోసం న్యూ ఫార్మాట్‌ను వినియోగిస్తోందని ఈ రిపోర్ట్ పేర్కొంది. జెపెగ్-ఎక్స్ఎల్ అని ఈ న్యూ ఫార్మాట్‌ను పిలుస్తారు. ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ బ్యాక్ ప్యానెల్లో డ్యూయల్ కెమెరా సెటప్ కలిగిఉంటాయని చెబుతున్నారు. 1x, 2x జూమ్ సామర్ధ్యాలతో ప్రైమరీ వైడ్‌యాంగిల్ లెన్స్‌తో కెమెరా సెటప్ ఉంటుంది. దీంతోపాటు విస్తృతమైన సీన్స్‌ను క్యాప్చర్ చేసేందుకు 0.5x జూమ్‌తో సెకండరీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి.
అంతకుముందు ఐఫోన్ 11 పోలిన కెమెరాలు వర్టికల్‌గా ప్లేస్ చేస్తారని అంతకుముందు ఈ ఫోన్ డిజైన్ లీక్‌లు వెల్లడించాయి. ఇక ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని డివైజ్‌లకు క్యాప్చర్ బటన్ ఫీచర్ ఉంటుందని చెబుతున్నారు. మొబైల్ ఫొటోగ్రఫీలో ఐఫోన్ 16 ప్రొను మెరుగైన సామర్ధ్యంతో కూడిన డివైజ్‌గా డిజైన్ చేసే క్రమంలో డెడికేటెడ్ క్యాప్చర్ బటన్, యాక్షన్ బటన్లను జోడించాలని యాపిల్ యోచిస్తోంది. ఫోకస్, జూమ్ లెవెల్స్‌ను అడ్జట్ చేసేందుకు క్విక్ బటన్ యూజర్లను అనుమతిస్తుంది.
Read More :
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్