IAS Officers | హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ సారి 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ నియామకం అయ్యారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇ. శ్రీధర్, దేవాదాయ శాఖ కమిషనర్‌గా శ్రీధర్‌కే అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళ, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి, రవాణా శాఖ కమిషనర్‌గా కే సురేంద్ర మోహన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్, ట్రాన్స్ కో సీఎండీగా కృష్ణ భాస్కర్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కూడా కృష్ణ భాస్కర్ కొనసాగనున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివశంకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజన నియామకం అయ్యారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | టీజీపీఎస్సీ చైర్మన్ నియామానికి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ నవంబర్ 20
KTR | సీఎం మూర్ఖత్వం వల్ల అధికారులపై దాడులు.. రేవంత్ పాలనపై కేటీఆర్ ధ్వజం
KTR | ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలు తిరగబడుతున్న పాలన.. కేటీఆర్ ట్వీట్