సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 22:39:52

తెలంగాణలో కొత్తగా 1269 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 1269 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనాకేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇవాళ రాష్ట్రంంలో కొత్తగా 1269 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 557 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి లో 111 కేసులు, మేడ్చ‌ల్ లో 87 కేసులు న‌మోద‌య్యాయి. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 45076 పాజిట‌టివ్ కేసులు నిర్ధారణ కాగా..కరోనా ప్రభావంతో ఇవాళ ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 415కు చేరింది. ఇవాళ 1831 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 32,438 మంది డిశ్చార్జి అయ్యారు. 

వ‌రంగ‌ల్ అర్బ‌న్-117, వ‌రంగ‌ల్ రూర‌ల్ -41, క‌రీంన‌గ‌ర్-27, కామారెడ్డి-67, సంగారెడ్డి-28, మెద‌క్ -29, పెద్ద‌ప‌ల్లి-29, నిజామాబాద్‌-24, న‌ల్ల‌గొండ‌-26తోపాటు ప‌లు వివిధ జిల్లాల్లో కేసుల వివ‌రాలు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo