కాళేశ్వరం, ఆగస్టు30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు (Madigadda barrage) గోదావరి నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బరాజ్‌కు మానేరు, కాల్వల ద్వారా 3500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, మొత్తం 66 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం (Kaleswaram) వద్ద గోదావరి(Godavari) ప్రవాహం తగ్గుతోంది. 1.75 లక్షల క్యూసెక్కులతో 85 మీటర్ల ఎత్తులో లక్ష్మీ బరాజ్ వైపు పరుగులు తీస్తున్నాయి.