హైదరాబాద్ : కంటికి రెప్పలా కాపాడి పెంచి పోషించిన తండ్రిపై డబ్బుల కోసం కిరాతకంగా దాడి చేసి హత్య (Murder)చేసిన కన్న కొడుకు, ఇద్దరు కూతుర్లకు యావజ్జీవ(Life sentence) కారాగార జైలుశిక్ష రూ.5వేల జరిమానా విధిసూ రంగారెడ్డి జిల్లా 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి యం.సతీష్‌కుమార్ తీర్పునిచ్చారు. అదనపు పీపీ మోతే గంగారెడ్డి కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా(Rangareddy) బాలాపూర్ మండలం జిల్లెలగూడకు చెందిన మేడిపల్లి కృష్ణ(58)కు అయిదుగురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుర్లకు వివాహం అయింది.
వాటర్ వర్క్స్‌లో పనిచేసిన కృష్ణ రిటైర్మెంట్ కాగా తమకు డబ్బులు ఇవ్వాలని కొడుకు తరుణ్(24) కూతుర్లు అంజలి(25), ప్రియాంక(19) తండ్రితో గొడవపడగా ఇదే సమయంలో కొడుకు తరుణ్ ఐరన్‌రాడ్‌తో దాడి చేయగా తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడు సోదరుడు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితులకు పైవిధం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.