Paralympics 2024 : పారిలింపిక్స్లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పారా షూటర్లు అవనీ లేఖరా(Aanvi Lekhari) పసిడితో గర్జించగా మోనా అగర్వాల్(Mona Agarwal) కంచు మోత మోగించింది. వీళ్ల స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్(Preethi Pal) సంచలనం సృష్టించింది. ట్రాక్ విభాగంలో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది.
శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల టీ35 ఫైనల్లో ప్రీతి కాంస్యం పతకం కొల్లగొట్టింది. దాంతో, పారిస్ పారిలింపిక్స్లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. 100 మీటర్ల ఫైనల్లో ప్రీతి చిరుతలా పరుగెత్తింది. 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది.
BRONZE 🥉 For INDIA 🇮🇳
🏃♀️ Preethi Pal wins bronze medal in the Women’s 100m T35 Final.#Paris2024 #Cheer4Bharat #Paralympics2024 #ParaAthletics @mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI @AkashvaniAIR @DDNational… pic.twitter.com/igEYUhtpmu
— Doordarshan Sports (@ddsportschannel) August 30, 2024
Ek pal hamesha yaad aayega 🤌
Preethi Pal wins 🥉 in the women’s 100m – T35 with a personal best time of 14.21 seconds. 🤩#Paralympics | #Paris2024 pic.twitter.com/Elt7dKoCu6
— Olympic Khel (@OlympicKhel) August 30, 2024
తద్వారా ట్రాక్ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా ప్రీతి రికార్డు నెలకొల్పింది. ఇదే పోటీల్లో అదరగొట్టిన చైనా (China) క్రీడాకారిణులు జౌ గ్జియా, గువో కియాన్కియాన్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, వెండి పతకాలు తన్నుకుపోయారు.
Strong start!💥
Avani Lekhara defends her 🥇in the R2 women’s 10m Air rifle standing SH1 event from Tokyo 2020 with a new Paralympic record.
Mona Agarwal wins 🥉 in her Paralympic debut.#Paralympics | #Paris2024 pic.twitter.com/dLFovJykf8
— Olympic Khel (@OlympicKhel) August 30, 2024
ఆద్యంతం ఉత్కంఠ రేపిన పారా షూటింగ్ ఫైనల్లో తొలుత అవని వెనకబడింది. అయితే.. తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్న దక్షిణ కొరియా పారా షూటర్ లీ యున్రీ (Lee Yunri)ఆఖరి రౌండ్లో తడబడింది. యున్రీ 6.8 పాయింట్లకే పరిమితమవ్వగా.. అవని చెక్కు చెదరని గురితో 10.5 పాయింట్లు సాధించింది. దాంతో, మొత్తంగా 249.7 పాయింట్లతో రికార్డు నెలకొల్పిన భారత పారా షూటర్ పసిడి వెలుగులు విరజిమ్మింది.