Tantrik rapes Girl | శ్మశానవాటిక వద్ద.. బాలికపై మంత్రగాడు అత్యాచారం
Tantrik rapes Girl | శ్మశానవాటిక సమీపంలో నివసించే మంత్రగాడు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అనారోగ్యంతో ఉన్న ఆమె తండ్రి చనిపోతాడని బెదిరించాడు. బాలిక అస్వస్థత చెందటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: శ్మశానవాటిక సమీపంలో నివసించే మంత్రగాడు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Tantrik rapes Girl) ఈ విషయం ఎవరికైనా చెబితే అనారోగ్యంతో ఉన్న ఆమె తండ్రి చనిపోతాడని బెదిరించాడు. బాలిక అస్వస్థత చెందటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. క్షుద్ర పూజలు చేసే 52 ఏళ్ల మహ్మద్ షరీఫ్, కంఝవాలాలోని శ్మశాన వాటిక సమీపంలో నివసిస్తున్నాడు. మంత్రగాడిగా, భూతవైద్యుడిగా స్థానికంగా ప్రచారం పొందాడు.
కాగా, భార్య చనిపోయిన ఒక వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి కంఝవాలా ప్రాంతంలో నివసిస్తున్నాడు. కూరగాయలు అమ్మి జీవించే అతడు ఆగస్ట్ 26న అనారోగ్యానికి గురయ్యాడు. భూతవైద్యుడు మహ్మద్ షరీఫ్ అతడి ఇంటికి వచ్చి పరిశీలించాడు. పూజలు చేయాలన్న అతడు బాలికతో బియ్యం పంపాలని చెప్పాడు.
మరోవైపు ఏడేళ్ల కుమార్తె వెంట కుమారుడ్ని కూడా ఆ వ్యక్తి పంపాడు. కొంత సమయం తర్వాత ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చాడు. పూజల కోసం సోదరిని ఆ మంత్రగాడు తన వద్ద ఉంచుకున్నట్లు తండ్రికి చెప్పాడు. కొన్ని గంటల తర్వాత ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. అయితే మౌనంగా ఉన్న ఆమె ఆ మరునాడు అస్వస్థతకు గురైంది. బాలికను హాస్పిటల్‌కు తరలించగా ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు డాక్టర్లు గుర్తించారు.
కాగా, బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ మంత్రగాడైన మహ్మద్ షరీష్‌ను అరెస్ట్ చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన అతడు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అనారోగ్యంతో ఉన్న ఆమె తండ్రి చనిపోతాడని బెదిరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అలాగే ఆ బాలికకు రూ.51 నగదును ఆ భూత వైద్యుడు ఇచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

