న్యూయార్క్ జైలుకు మదురో.. నార్కో టెర్రరిజానికి పాల్పడ్డారని అమెరికా ప్రభుత్వం ఆరోపణ
అమెరికా అరెస్ట్ చేసిన వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో (63)ను ఆదివారం న్యూయార్క్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆయన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఉగ్రవాదానికి పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తున్నది.
- వెనెజువెలాను అమెరికా నడుపుతుందన్న డొనాల్డ్ ట్రంప్
- వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్‌ను నియమించిన ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం
న్యూయార్క్: అమెరికా అరెస్ట్ చేసిన వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో (63)ను ఆదివారం న్యూయార్క్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆయన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఉగ్రవాదానికి పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తున్నది. మదురో ప్రభుత్వం మాదక ద్రవ్యాల తయారీలో నిమగ్నమైందని, కార్టెల్స్‌కు ఆశ్రయం ఇస్తున్నదని, అమెరికన్లను నాశనం చేయడం కోసం అమెరికాలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా పంపిస్తున్నారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలపై ఆయనను విచారిస్తారు.
మదురోపై న్యూయార్క్‌లో కేసు నమోదు
మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్, ఆయన కుమారుడు, మరో ముగ్గురిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. మదురో నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతి కుట్రలకు పాల్పడ్డారని, విధ్వంసకర పరికరాలతోపాటు మెషీన్ గన్స్‌ను కలిగియున్నారని ఆరోపణలు నమోదయ్యాయి. మదురోను సోమవారం మన్హటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
వెనెజువెలాను మేమే నడుపుతాం : ట్రంప్
సురక్షితంగా, న్యాయంగా అధికార మార్పిడి జరిగే వరకు వెనెజువెలాను తాత్కాలికంగా అమెరికా నడుపుతుందని, అక్కడ విస్తృతస్థాయిలో ఉన్న చమురు నిక్షేపాలను తీసుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. అక్కడి చమురును ఇతర దేశాలకు విక్రయిస్తామని కూడా తెలిపారు. అమెరికా సార్వభౌమత్వాన్ని బెదిరించే వారికి, అమెరికన్ల జీవితాలకు ప్రమాదం కలిగించే వారికి ఈ విజయవంతమైన ఆపరేషన్ ఓ హెచ్చరిక అని చెప్పారు. మదురో నివాసానికి నకలును అమెరికన్ దళాలు నిర్మించాయని ట్రంప్ చెప్పారు.
ఈ ఆపరేషన్ ైక్లెమాక్స్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూశానన్నారు. “నేను చూశాను, అక్షరాలా, టెలివిజన్ షో చూసినట్లు చూశాను” అని చెప్పారు. వెనెజువెలా స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటలకు అమెరికా డెల్టా ఫోర్స్ దాడి చేసింది. రాజధాని నగరం కారకాస్‌లోని ఫోర్ట్ టియూనా మిలిటరీ కాంప్లెక్స్‌లోని మదురో నివాసంలోకి దూసుకెళ్లింది. పవర్ గ్రిడ్ వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో సుమారు 40 మంది మరణించారు.
తాత్కాలిక ప్రెసిడెంట్ నియామకం
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు నియమించింది. పరిపాలన కొనసాగడానికి, దేశ సమగ్ర రక్షణ కోసం ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపింది. ఇది అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోదగిన అత్యంత తీవ్ర పరిణామమని పేర్కొంది.తమ దేశ వ్యూహాత్మక వనరులను, ముఖ్యంగా చమురు, ఖనిజాలను కబ్జా చేయడం కోసమే ఈ దాడికి అమెరికా తెగబడిందని తెలిపింది. తమ దేశ రాజకీయ స్వతంత్రతను బలవంతంగా దెబ్బతీసిందని ఆవేదన చెందింది.
శాంతియుతంగా పరిష్కరించుకోవాలి: భారత్
వెనెజువెలాలో తాజా పరిణామాలు తీవ్ర ఆందోళనకరమని భారత్ పేర్కొంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. వెనెజువెలా ప్రజల భద్రత, సంక్షేమాలకు మద్దతును పునరుద్ఘాటించింది. సంబంధిత భాగస్వామ్య పక్షాలు చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది.
మదురోను వెంటనే విడుదల చేయాలి: చైనా డిమాండ్
మదురో, ఆయన భార్యను అమెరికా బంధించి తీసుకుపోవడం పట్ల చైనా ఆదివారం తీవ్రంగా స్పందించింది. మదురో, ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. బలవంతంగా ఒక దేశ అధ్యక్షుడు, ఆయన భార్యను తమ దేశానికి బంధించి తీసుకుపోవడం అంతర్జాతీయ చట్టాన్ని, అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడేందుకు ఉద్దేశించిన యూఎన్ చార్టర్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

