Tech Layoffs : టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతుండటంతో టెకీల్లో గుబులు రేపుతోంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా పలు టెక్ దిగ్గజాలు 2024లోనూ లేఆఫ్స్‌ను కొనసాగిస్తున్నాయి. వ్యయ నియంత్రణ చర్యలు, ఏఐపై ఫోకస్, కొవిడ్ అనంతరం మార్కెట్ సర్దుబాట్ల కారణంగా కంపెనీలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆగస్ట్ నాటికి లేఆఫ్స్ కారణంగా ఏకంగా 1,36,000 మంది కొలువులు కోల్పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
2022, 2023లో టెక్ కంపెనీలు గణనీయంగా సిబ్బంది సంఖ్యను కుదిస్తే ఈ ఏడాది సైతం కొలువుల కోత తప్పడం లేదు. లేఆఫ్స్ ట్రాకర్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ డేటా ప్రకారం ఆగస్ట్ 30 నాటికి 422 కంపెనీలు 1,36,782 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఆగస్ట్ నెలలో వందలాది ఉద్యోగులపై టెక్ కంపెనీలు వేటు వేశాయి. ఇక ఈ ఏడాది యాపిల్ సహా గొప్రొ, సోనోస్, సిస్కో, డెల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు ఉద్యోగుల కుదింపును ప్రకటించాయి.
ఇక వ్యయ నియంత్రణ చర్యలు, ఏఐపై దృష్టి మళ్లింపు, పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలతో టెక్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా చర్యలు చేపట్టడంతో ఈ ఏడాదిలోనూ లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. కొలువుల కోత కొనసాగడంతో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్లు తగ్గడంతో ఫ్రెషర్లు ఆందోళన చెందుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు కళ తప్పడం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను కలవరపరుస్తోంది.
Read More :
AP News | నన్ను ఆటబొమ్మలా వాడుకున్నారు.. ముంబై నటి జత్వానీ కీలక వ్యాఖ్యలు..