హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కోట్లాది రూపాయల విలువైన కీలకమైన పనులను నాకు చెప్పకుండా మీకు మీరే ఇష్టారాజ్యంగా మొ దలుపెట్టి, ఇప్పుడు నా సంతకాలు ఎందుకు అడుగుతున్నరు? అడ్డగోలు ఫైళ్లను నా ముందు ఎందుకు పెడుతున్నరు? నన్ను ఇరికించాలని చూస్తున్నరా? అని ఆ యిల్ఫెడ్ బోర్డు, వార్షిక సమావేశాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, వ్యవ సాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ అధికారులపై మండిపడినట్టు తెలిసింది. నిధులకు సంబంధించిన దస్ర్తాలపై ఎలాంటి చర్చ లేకుండా.. సంతకాలు ఎలా పెట్టాలని నిలదీసినట్టు సమాచారం. చర్చ లేకుండా కీలక దస్ర్తాలపై సంతకాలు చేయబోనని స్పష్టంచేయడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసినట్టు తెలిసిం ది. వారం క్రితం జరిన ఈ ఉదంతంపై వ్యవసాయశాఖలో జోరుగా చర్చ జ రుగుతున్నది.
రెండు మూడు ఫైళ్లు చూసి షాక్‌కు గురైన కార్యదర్శి.. ఇలాంటి ఇరికించే కార్యక్రమాలు పెట్టొద్దు… నన్ను ఇరికించాలని చూస్తున్నరా? అని ముఖం మీదనే చెప్పడంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు విస్తుపోయినట్టు తెలిసింది. ఇంతలో ఓ ముఖ్యమైన అధికారి జోక్యం చేసుకొని ‘సార్.. కనీసం ఇప్పటికే పూర్తయిన కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లనైనా అప్రూవ్ చేయండి. లేదంటే బిల్లు లు పెండింగ్‌లో పడుతాయి’ అని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితిలోనూ అడ్డగోలు ఫైళ్లపై సంతకాలు చేసే ప్రసక్తే లేదని కార్యదర్శి ని రాకరించినట్టు తెలిసింది. అన్ని ఫైళ్లను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఆయిల్‌ఫెడ్ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని కార్యదర్శి భావిస్తున్నారా? అలాంటివి ఆయన దృష్టికి వెళ్లాయా? అందుకే ఆ వ్యాఖ్యలు చేశారా? అని అధికారుల్లో చర్చ జరుగుతున్నది.