KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో మారిషస్ విదేశాంగ, వాణిజ్యశాఖ సహాయ మంత్రి హంబైరాజన్ నర్సింఘెన్ సమావేశమయ్యారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత దశాబ్దకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధిపై చర్చించారు. అలాగే, భవిష్యత్లో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య విస్తరణకు ఉన్న అవకాశాలు, పెట్టుబడులు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు బీఆర్ఎస్ నేత తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వివరించారు. మారిషస్ మంత్రిని కలువడం సంతోషంగా ఉందన్నారు.