IAS Ronald Rose | ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఐఏఎస్ అధికారిని ఏపీకి కేటాయిస్తూ గతేడాది అక్టోబర్‌లో డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. డీవోపీటీ ఆదేశాల మేరకు ఆయన గతేడాది ఏపీలో రిపోర్టు చేశారు. ఆ తర్వాత క్యాట్‌ను ఆశ్రయించారు. రోనాల్డ్ రాస్ పిటిషన్‌ను విచారించిన క్యాట్ తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ సమయంలో ఆయనను డీవోపీటీ ఏపీకి కేటాయించింది.
క్యాట్‌ను ఆశ్రయించి పది సంవత్సరాల పాటు తెలంగాణలోనే విధులు నిర్వర్తించారు. గతేడాది డీవోపీటీ ఐఏఎస్‌లను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్‌ను విచారించిన క్యాట్ స్థానికత ఆధారంగా ఆయనను తెలంగాణకే కేటాయిస్తూ అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులపై డీవోపీటీ మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆయన మళ్లీకి ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.