అగ్ర హీరో కార్తి నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బుధవారం ఈ సినిమా నుంచి ‘అన్నగారు..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని, కార్తి పాత్ర నవ్యరీతిలో సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో కార్తి పోలీసాఫీసర్‌గా కనిపిస్తారని, ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని మేకర్స్ తెలిపారు. కృతిశెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, రచన-దర్శకత్వం: నలన్ కుమారస్వామి.