‘ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నానో.. ఎలాంటి ఎమోషన్లు నా సినిమాలో ఉండాలని కోరుకున్నానో.. ఎలాంటి కేరక్టర్ పోషించాలని ఆశించానో అవన్నీ వందశాతం కుదిరిన సినిమా ‘భజే వాయువేగం’ అని హీరో కార్తికేయ అన్నారు.
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా అదృష్టం ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా కూడా అవకాశం రానప్పుడు నిరూపించుకునే చాన్స్ కూడా లేదు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్ ను స్థాపించి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తున్నారు.