సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. మానస వారణాసి కథానాయిక. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్నది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
నిర్మాత ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని, ఫ్రెండ్షిప్, లవ్, రొమాన్స్.. ఈ మూడింటి చుట్టూ తిరిగే ఈ కథ తప్పక అందరికీ నచ్చుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: ఆదిత్య రవీంద్రన్.