ఒక్క హిట్ తో కెరీర్ సెట్.. ప్రభాస్ ప్రయత్నం సక్సెస్
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా అదృష్టం ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా కూడా అవకాశం రానప్పుడు నిరూపించుకునే చాన్స్ కూడా లేదు.

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా అదృష్టం ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా కూడా అవకాశం రానప్పుడు నిరూపించుకునే చాన్స్ కూడా లేదు. అందుకే ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉంటే ఇండస్ట్రీలో ఈజీగా ముందుకు వెళ్లొచ్చు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఒక హీరోకు ఇలాగే గైడెన్స్ ఇచ్చాడు. అండగా నిలబడటమే కాకుండా ఆయన కెరీర్ కు కావాల్సిన బూస్టప్ ఇస్తున్నాడు.
అతడే సంతోష్ శోభన్.. వర్షం సినిమా దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్. తనకు అంత మంచి విజయం ఇచ్చాడని కృతజ్ఞతతో ఆయన కొడుకు బాధ్యతలు తీసుకున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఏక్ మినీ కథ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు సంతోష్ శోభన్. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ సినిమాను కార్తీక్ రాపోలు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఎవరూ టచ్ చేయని ఒక బోల్డ్ పాయింట్ ను ఈ సినిమాలో డిస్కస్ చేశారు దర్శక నిర్మాతలు.
ఏక్ మినీ కథ తర్వాత ప్రస్తుతం ఈయన పెళ్లి నేపథ్యంలో ప్రేమ్ కుమార్ అనే కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా ఈ కుర్ర హీరో కోసం లైన్లో ఉన్నాయి. మొత్తానికి మరో రెండు హిట్లు పడితే ప్రభాస్ చేసిన ప్రయత్నం ఫలిస్తుంది.
ఇవి కూడా చదవండి..
మహేష్ ఫ్యాన్స్ కోసం సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

