క్యాబినెట్ సమావేశం ఈనెల 10న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యా హ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరుగనున్నది.
రాష్ట్రంలో ఏడాదిలోగా వైద్య కళాశాలల భవనాలతోపాటు దవాఖానాలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి అవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
జైళ్ల నిర్వహణలో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రీట్రీట్ లో ఆమె మాట్లాడుతూ.. 2002 నుంచి రీట్రీట్ జరుగుతున్నట్టు తెలిపారు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. బదిలీ ప్రక్రియను ఈ నెల 5వ తేదీన ప్రారంభించి, 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.