Employee Transfers | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. బదిలీ ప్రక్రియను ఈ నెల 5వ తేదీన ప్రారంభించి, 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తిరిగి జూలై 21వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలవుతుందని పేర్కొన్నారు.
బదిలీలకు మార్గదర్శకాలు
బదిలీల షెడ్యూల్ ఇలా..
‘317’ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?
బదిలీలపై నిషేధం ఎత్తివేతను స్వాగతిస్తున్నామని, అయితే జీవో 317 బాధిత ఉద్యోగులపై స్పష్టత ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ పేర్కొన్నది. కమిటీకి సుమారు 50 వేల మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గుర్తు చేశారు. కమిటీ త్వరగా సిఫారసులు ఇచ్చి, బాధిత ఉద్యోగులకు బదిలీల్లో సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు.
ఎన్నికలప్పుడు బదిలీ అయిన వారికి అవకాశమివ్వాలి: టీజీవో
ఇటీవలి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బదిలీ అయిన ఉద్యోగులకూ బదిలీల్లో అవకాశమివ్వాలని టీజీఓ కేంద్ర సంఘం విజ్ఞప్తి చేసింది. సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించకుండా కేవలం ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వారిని బదిలీ చేశారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా బదిలీ అయినవారి ఇబ్బందులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
బదిలీలపై నిషేధం ఎత్తివేత హర్షణీయం
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత హర్షణీయమని తెలంగాణ పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. జూన్ 30 వరకు 317 జీవో సబ్ కమిటీకి సుమారు 50 వేల వరకు అన్ని శాఖల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, జూలై 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు.