Transfers | ఇంటర్ విద్యా కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. 700కుపైగా జూనియర్ లెక్చరర్లు, 350 మంది ప్రిన్సిపాళ్లు, 450 మంది బోధనేతర సిబ్బంది బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. బదిలీ ప్రక్రియను ఈ నెల 5వ తేదీన ప్రారంభించి, 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.