హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నా తమకు మాత్రం అన్యాయం జరుగుతున్నదని అర్థగణాంక శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. బదిలీలకు సంబంధించి ఈ నెల 3న ప్రభుత్వ జీవో ప్రకారం.. ఏ ఉద్యోగి అయినా నాలుగేండ్లకు మించి ఒకే చోట పనిచేయరాదన్న నిబంధన ఉన్నదని గుర్తు చేస్తున్నారు. నిబంధనను తుంగలో తొక్కి బదిలీల్లో తమ పేరు లేకుండా ‘మేనేజ్’ చేశారని చెప్పుకుంటున్నారు.