హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యా కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. 700కుపైగా జూనియర్ లెక్చరర్లు, 350 మంది ప్రిన్సిపాళ్లు, 450 మంది బోధనేతర సిబ్బంది బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.
మార్గదర్శకాలను విద్యాశాఖ ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనుంది. బదిలీల్లో జీరో సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు పేర్కొంటున్నారు. నిరుడు మేలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించగా, వీరి సర్వీసు ఏడాది మాత్రమే పూర్తయ్యింది. దీంతో వీరికి తాజా బదిలీల్లో అవకాశం కల్పించబోమని చెప్పారు. వీరితో పాటు 447 మంది వీఆర్వోలను ఇంటర్బోర్డులో విలీనం చేశారు. వీరికి సైతం తాజా బదిలీల్లో అవకాశం కల్పించబోమని అధికారులు తెలిపారు.