గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏడాది కిందట మొదలైన ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సెర్ప్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. బదిలీ ప్రక్రియను ఈ నెల 5వ తేదీన ప్రారంభించి, 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.