Telangana | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : జీవో 317తో ప్రభావితులైన ఉద్యోగుల బదిలీలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెవెన్యూ శాఖలో వివిధ జోన్ల మధ్య ఉద్యోగులను బదిలీ చేశారు. ఆఫీస్ సబార్డినేట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీ న్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాల మేరకు మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలు చేపట్టారు. శాఖలవారీగా ఉత్తర్వులు విడుదల చేస్తారని సచివాలయ వర్గాలు తెలిపాయి.