హైదరాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకృత విద్యుత్ పంపిణీ రంగ పథకం(ఆర్డీఎస్ఎస్)లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంపిణీ సంస్థల సీఎండీలు ముషారఫ్, వరుణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.