Rupa reddy | నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. గంజాయి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేశారు. ఆమె స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి నిందుతులు చొరబడ్డారు.
ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్న నిందితులు ఆమె ఫ్రెష్ అయి బెడ్రూమ్లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి చంపారు. ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న రూ.2 లక్షల డబ్బును ఎత్తుకెళ్లారు. ఆ డబ్బుతో హైదరాబాద్లో జల్సాలు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు
27 సార్లు పొడిచి ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన టెన్త్ క్లాస్ విద్యార్థులు
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని… https://t.co/DimqkxzkvY pic.twitter.com/vapjJhR6v3
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026